Tuesday, November 24, 2009

చ్చీ ..పాడు వర్షం...

ఏంటి ధీర్ఘంగా ఆలోచిస్తున్నావ్?ఇంటి పై కప్పు దేని తో వేయాలానా ? చార్మినార్ ఆజ్బెస్టాస్ రేకులు వాడితే సరి....హి హి హి ..మ్మ్ ఆపుతావా!మరి దేనికంత నిరాశగా ఉన్నావ్?పాడు వర్షం ఎక్కడికి పోవడనికి లేదు రావడానికి లేదు. అసలు ఎప్పుడు నీకు చిరాకే..జోరున వర్షం పడినా, చల్లగా మంచు కురుస్తున్నా...అన్నిటికి విసుక్కుంటావ్..అసలు ఆ వర్షం పడె ముందు మట్టిలోంచి వఛ్చే వాసన ఎంత అధ్భుతంగా ఉంటుంది ..అలాంటి వాసన నీకు ఏ ఇటాలియన్ సెంట్ లో 100 "£" పెట్టి కొన్నా రాదే.ఎప్పుడు బిజీ నే. వర్షాలు రాకపొతే తిడతావు, వర్షాలు పడితే విసుక్కుంటావ్. ఐనా కార్ లొ కిటికి అద్దాలన్ని ముసేసుకుని ఎక్కడ రెండు చినుకులు కార్ లో పడితే కార్పెట్ పాడైపొతుందనే భాదే గా.. ,ఎంచక్క కార్ లొనించి వర్షాన్ని చూసి అనందించవచ్చు కదా?
సరదాగా పిల్లలు ఏ రొజైనా వర్షం తో ఆడుకుంటున్నారా?అసలు వాళ్ళకి వాన వాన వల్లప్పా ,వాకిలి తిరుగు చెల్లప్ప అనె పాట పాడాలనైనా తెలిసేట్టు చేస్తున్నావా?చిట్టి చిట్టి పడవలు చేయడం సుమ్మర్ కాంప్ లో నేర్చుకుంటున్నారే.. ఎంత చోద్యం ? పడవలు చేయడం సరదాగ ఆనకట్టలు కట్టడం డాబా మీద తూముల్లో నీళ్ళు తీయడం లాంటి చిన్న చిన్న సరదాలన్ని మర్చిపొతున్నారు పిల్లలు ..ప్చ్హ్..అపార్ట్ మెంట్ కల్చర్, విదేసి ప్రయాణాలు కదా .

నల్లని మబ్బులు గుంపులు గుంపులు తెల్లని కొంగలు బారులు బారులు అవిగో అవిగో అంటు సరదాగ పాడుకుంటు అటు ఇటు తిరిగే ఆ రోజులేవి ? సీజన్ లెస్ రైన్స్ అంటు గొడుగులు రైన్ కోట్స్ వేసుకుని పరిగెడుతున్నావ్ అదేంటి అంటె గ్లోబల్ వార్మింగ్ అంటావ్..ఏంటొ .. వర్షాకాలం రాబోతోందనేందుకు గుర్తుగా పుట్టలు పుట్టలు చీమలు కనిపించేవి.ఇప్పుడు ఆ చీమలు కూడ రాకుండా గొడకు కొట్టే సున్నం లో భయంకరమైన విషపు మందులు వాడి వాటిని దూరం చేసావ్. చీమలనుంచి మనమెంతో నేర్చుకుందాం అంటు పత్రికల్లో చదవడం అవసరమొచ్చినప్పుడు మాట్లాడ్డం అంతే గాని ప్రకృతిని దగ్గరనించి చూడడం మర్చిపోయావు. వర్షం పడే రాత్రి ఉధృతమైన గాలి,ఉరుముల మెరుపుల శబ్దాలు,కప్పల బెక బెకలు నీకు వినిపించట్లేదు కదూ ..అవునులే టి.వి లో
special movie లేదా its raining heavy here ఇంటర్నెట్ చాటింగ్ లో బిజి కదా. నువ్వు యాంత్రికంగా తయారయ్యావు. వర్షం లో సరదాగ గడపడం నీకిష్టమే కాని నీకు హిపోక్రశి. ..చ్చీ ..పాడు వాన అంటు చిరాకు పడుతున్నావ్.. ఎందుకో తెలుసా? నువ్వు అనుకున్న పని జరగలేదు, నువ్వు గమ్యాన్ని చేరలేదు..ఆ భాద ని చిరాకు రూపం లో వర్షం మీద నెడుతున్నవ్..చిరాకు ని మర్చిపో నువనుకున్నట్టు అన్నిటిని ఆనందించగలవు ..ఐ ప్రామిస్ యూ.

8 comments:

శరత్ కాలమ్ said...

Correct.

అవకాశం వున్నాకూడా ఆడుకోనివ్వకుండా పిల్లలని మహా సున్నితంగా పెంచుతున్నారు కొందరు.

హవ్వ, హవ్వ. పిల్లలు ఆడుకొంటున్నారా! తప్పుకాదూ!! పైగా వర్షంలోనా!!! జలుబు చేయదూ. పిల్లలు బుద్ధిగా టివి చూస్తూ కూర్చోవాలి - అందులో వర్షాన్ని చూడాలి. --- ఇలా వుంటున్నారండీ ఈ కాలం సుకుమారం పేరేంట్స్.

praveena said...

varshamlo aade avakaasam naaku ikkada ledhandi, endhukante bhayankaramaina chalitho vallu gadakattsthunte tadavaali ane aalochane raadhu. mee blogtho marchipoyina santhoshaanni gurthuchesinandhuku kruthagnathalu.

భావన said...

ఇప్పటి పిల్లలు వానా వల్లప్ప తిరిగి లోపలకు వస్తే ఒక అర గంట లో జలుబు రెండు గంటలలో జ్వరం వస్తాయి. ఇంక వాన ఇది వరకంత స్వచ్చత ఎక్కడ వుంది అండి. చిన్నప్పటి పల్లెటూరి/ పట్టణపు సరదాలు గుర్తు చేసేరు. ధన్య వాదాలు.

duttaluri said...

యెక్కువగా పడే వానలో స్పీడుగా కార్ తోల్తూ ఉండె ఆనందం కూడా ఉంది కదండి? నిజంగ వాన పడ్తూ ఉన్నప్పుడు గుంద్రంగా తిరుగుతూ ఆకాశంలోకి చూస్తూంటే .....అక్షరాల్లొ వివరించలేం...Thanks andi

జయ said...

వర్షంలో ఆనందం చాలా బాగా చెప్పారు. ఇటువంటి అనుభూతులే జీవితపు విలువను పెంచి అమితానందాన్ని ఇస్తుంది. చాలా బాగా రాసారు.

మాలా కుమార్ said...

చీ పాడు వర్షం అంటూ , ఎంత బాగా చెప్పారు . అపార్ట్మెంట్ లలో కూడా బాల్కనీ లో కూర్చొని , వేడి పకోడీలు తింటూ , నవల చదువుకుంటూ వానను ఆస్వాదించవచ్చు కదండి .

Dutt said...

Here I do not have telugu script supporting my browser to write the comment in telugu.

your post is excellent. thanks for posting. I keep watch your blog rss feed.

for me, It doesn't matter with AGE or place.

kondaru aakalam loo ala, ee kalam lo ilaa, maa voorlo ila, city lo ila ani sodi chestaru kaani... Still, our family enjoy the rain a lot.

I do not think so children catch cold quickly as far as we give right nutrition to get good immunity.

thanks, Dutt

kumar said...
This comment has been removed by the author.