Wednesday, May 14, 2008

గజేంద్ర మోక్షం లో ని పద్యాలు

పోతానామత్యుల వారి చే ఆంధ్రీకరింపబడి వ్యాస భగవానుని విరచితమైన భాగవతం లో ని గజేంద్ర మోక్షం లో ని కొన్ని నాకిష్టమైన పద్యాలు.

లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యె ప్రాణంబులున్
ఠావుల్ దప్పెను మూర్చ వచ్చె తనువున్ డస్సెన్ శ్రమంబయ్యెడిన్
నీవే తప్ప ఇతహ్ పరంబెరుగ మన్నింపం దగున్ దీనునిన్
రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మకా

సిరికిం జెప్పడు శంఖ చక్ర యుగముం చేదోయి సంధింప డే
పరివారంబును జీర డభ్రగపతిన్ మన్నింపడా కర్ణికాం
తర ధమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీ కుచో
పరి చేలాంచలమైన వీడడు హరి గజప్రాణా వనోత్సాహి యై


ఎవ్వని చేఁ జనించు జగ మెవ్వని లోపల నుండు లీనమై
ఎవ్వని యందు డిందు పరమేశ్వరుడెవ్వడు? మూల కారణం
బెవ్వ? డనాది మధ్య లయుడెవ్వడు సర్వము తానె యైన వా
డెవ్వడు వాని నాత్మ భవు నీశ్వరు నే శరణంబు వేడెదన్

కలడందురు దీనుల యెడ
కలడందురు భక్త యోగి గణముల పాలం
గలడందురన్ని దిశలను
కలడు కలండనెడు వాడు కలడో లేడో

(తెలుగు పెరంట్ వారికి కృతజ్ఞతలతో)

3 comments:

భావకుడన్ said...

http://www.andhrabharati.com/itihAsamulu/bhAgavatamu/08/smb0801.html#gajEMdramOxamu

mottamu gajendra mokshamu chadavaalanukunte ikkada choodandi. manchi padyaalu marosaari gurtuku chesinanduku thanks.

సూర్యుడు said...

నాక్కూడా ఈ పద్యాలు చాలా ఇష్టం, ఇంకొకటి కూడా ఉంది,

"అలవైకుంఠపురములో ..." (మహా పద్యాల జాబితాలోకొచ్చేవి ఇవి :-))

నందు said...

సుజనగారూ మీ బ్లాగ్ బాగుంది మీ ప్రస్థానికి గమ్యం ఎక్కడో అన్నారు.. చాలా మంచిదీ ఉన్నతమైనదీ అయిన గమ్యాన్నే చేరుతారు .. నాకూ మీలాగే తెలుగు సాహిత్యమంటే చాలా ఇష్టం ..మరిన్ని టపాలు ప్రచురించండి.. పెద్దనామాత్యుల పద్యాలు అమొఘంగా ఉన్నాయి ..మరిన్ని పొందుపరచవలసింది గా కోరుతున్నాను..

ఇట్లు

రాపాక అనందు