Thursday, April 3, 2008

రష్యా జానపద కధ తెలుగు అనువాదం

అల్యోనుష్క మరియు సోదరుడు ఇవానుష్క.

ఒకానొకప్పుడు , అందమైన ప్రదేశం లో, ఒక అక్క, తమ్ముడు, నడచుకుంటూ వెళ్తున్నారు. వారి పేర్లు అల్యౌనుష్క మరియు ఇవానుష్క. వారు అలా నడచుకుంటూ చాల దూరం వెళ్తుండగా వారికీ ఒక గొడ్ల చావిడి లో పశువుల కోసం వుంచిన నీరు కనిపించింది "అక్కా ,నేను ఆ నీరు తాగుతా" అడిగాడు చిన్న వాడయిన ఇవానుష్క. "వద్దు , నువ్వు దూడలా మారిపోతావు " అని అనింది అల్యోనుష్క. దాహంగా ఉన్నా, ఇవానుష్క అక్క మాటలకు సరేనన్నాడు. వారు అలా కొద్ది దూరం వెళ్ళగా వారికి ఒక గుర్రపుశాల లో గుర్రాల కోసం ఉంచిన నీరు చూసి దాహంగా ఉన్నఇవానుష్క నీరు తాగుతానని అడిగాడు అల్యోనుష్క ని. అవి తాగితే గుర్రపు పిల్లలా మారిపోతావు వద్దు అంటుంది. ఈ సారి కుడా సరే అన్నాడు ఇవానుష్క. అలా వెళ్తుండగా వారికి మేకల కోసం ఉంచిన నీరు కనిపించింది. దాహాన్ని ఆపుకోలేని ఇవానుష్క , అక్క వారిస్తున్నా వినకుండా ఆ నీరు తాగేసాడు ఇవానుష్క. తాగిన మరు క్షణమే చిన్న మేక పిల్లలా మారిపోయిన ఇవానుష్క ని చూసి విలపిస్తుంటుంది అల్యోనుష్క. అటుగా వెళ్తున్నఒక వర్తకడు జరిగింది తెలుసుకుని , తనని పెళ్లి చేసుకుంటే నువ్వు , మేక పిల్లలా మారిన నీ తమ్ముడు సంతోషంగా నా తోటే ఉండచ్చు అని చెప్తాడు.
అలా కొద్దిరోజులు సంతోషంగా గడుపుతుండగా ,ఒక రోజు , ఒక మంత్రగత్తె అల్యోనుష్క ని మాయ చేసి , నది ఒడ్డు కి తీసికెళ్ళి మెడకో రాయి కట్టి నీటిలో తోసేసి , అల్యోనుష్కలా మారిపోయి , సంతోషంగా వర్తకుడు తో కలిసి ఉంటుంది. పాపం, మేక పిల్లలా మారిన ఇవానుష్క కి మాత్రమె అసలైన నిజం తెలుసు. ఒక రోజు నది దగ్గర అల్యోనుష్క తో మాట్లాడటం చూసిన ఇవానుష్క తననని కుడా ఏదో చెయ్యాలని కుట్ర పన్నుతోందని అనుకుంటాడు .
అల్యోనుశ్క రూపం లో ఉన్న మంత్రగత్తె, మేక పిల్ల లా మారిన ఇవానుష్క ని చంపెయ్యమని చెప్తుంది వర్తకుడి . అది తన మనసుకి,కష్టం అనిపించినా భార్య రూపం లో ఉన్నమంత్రగత్తె మాటలను వింటాడు వర్తకుడు.
చంపేముందు చివరి సారిగా మంచి నీళ్లు తాగడానికి నది దగ్గరికి తీసుకు వెళ్ళమని అడుగుతాడు మేక పిల్ల రూపం లో ఉన్న ఇవానుష్క . అక్కకి తన పరిస్థితి చెప్పుకుంటాడు. తన మెడ కి రాయి కట్టుందని , ఇప్పుడు తను ఏ విధంగాను సహాయం చెయ్యలేనని చెప్తుంది.
అక్కడే ఉన్న గొడ్ల కాపరి వారిద్దరి సంభాషణ వినడం అక్క, తమ్ముళ్ళూ గమనించలేదు.
వర్తకుడి కి జరిగింది వివరిస్తాడు కాపరి. వర్తకుడు, పరిగెత్తుకుంటు వచ్చి నది లో ఉన్న అల్యొనుష్క ని బయటకి తీసుకు వచ్చి , మెడ కి కట్టి ఉన్న రాయి తీసి పారేస్తాడు.
మంత్రగత్తె ని పట్టుకుని, మదమెక్కిన గుర్రానికి కట్టెసి , గుర్రాన్ని వదిలేస్తారు. అది పొలం లో పిచ్చి గా అరుస్తూ , మంత్రగత్తె ని ఈడ్చుకుని పోతుంది. ఇవానుష్క కి తన మేక పిల్ల రూపం పొయి తిరిగి మాములుగా మారిపోతాడు. ఆ తరువాత ముగ్గురు సంతోషంగా కాలం గడుపుతుంటారు.

3 comments:

Anonymous said...

good one

Please remove comment verification in comments

Anonymous said...

చాలా బాగున్నది , చిన్నప్పు డు రాదుగ ప్రచురణలు లెలుగు లో తక్కవ ధరకే దోరికేవి ,
ఒక కధలో "మత్య మిత్రుని మంత్రమహిమాను సారం నాచిత్తాను సారం" అనే మంత్రం వుంటుంది ఆ కద పేరు గుర్తులేదు కాని అందు లో ఒక పిల్లవాడి కి చేప సహాయం చేస్తుంది - అ కద వివరాలు కోంచెం చెప్పరూ... ప్లీజ్

sujana said...

కాస్యప్ గారు,

ఇంతకు ముందు నేను వ్రాసిన కధలో దాన్ని గురించి ప్రస్తావించాను. దాని పేరు" మత్స్య మిత్రుడి మంత్ర మహిమ". త్వరలో నే దాన్ని కుడా వ్రాయలని నా ప్రయత్నం. వాటి ప్రతులు నా దగ్గర లేవు. నాకు గుర్తు ఉన్నంత మటుకు బాగ వ్రాయలని ప్రయత్నిస్తున్నాను. మీ ప్రోత్సహానికి అభినందనలు.