Sunday, April 13, 2008

చూచితిని ..సీతమ్మను..రామా



కమలోధ్భవుడైన బ్రహ్మ ముఖం నుండి వేదం, వల్మికసంభవుడైన వాల్మికి మహర్షి ఘంటం నుండి శ్రీమద్రామాయణం పుట్టాయి. బ్రహ్మ చతుర్ముఖుడు, వాల్మీకి చతుర వచనుడు. బ్రహ్మ లోక విధాత, వాల్మీకి శ్లొక విధాత. వాల్మీకి చేత ఆ వేదం సాక్షాత్తుగా రామాయణమై వెలసినది.అందుకనే రామాయణాన్ని ఆది కావ్యము, వాల్మీకి ని ఆదికవి అని అంటారు. రామాయణ సమాసం సంస్కృతం లో "రామస్య అయనం" రాముని యొక్క చరిత్ర అని అలాగె రామాయ:అయనం అంటే ఇక్కడ రామా శబ్దం స్త్రీ లింగం అగుట చేత ,రామా అంటె సీత అనే అర్ధం కూడా వస్తుంది కనుక సీత యొక్క చరిత్ర అని కూడా అర్ధం వస్తుంది. రామాయణం కావ్యమే కాదు, ధర్మ శాస్త్రం కూడా. ఇందులొ పుత్రధర్మము, మిత్రధర్మము, బ్రాతృధర్మము, భర్తృధర్మము, శిష్యధర్మము అన్నిటిని కూడా రాముడు తను ఆచరించి లోకానికి మార్గదర్సకుడు అయ్యారు. పరసతులని ఆసించిన రావణడు, పులస్త్యబ్రహ్మ ఐన కుడా అపకీర్తి ని పొంది చివరికి అధోగతి చెందాడు.
రామయణం లో అన్నిటికన్న అత్యధ్భుతమైన వర్ణన సుందరకాండము. అసలు ఎందుకు "సుందర"కాండం అని పిలవబడుచున్నది ? ఈ లోకం లో బాహ్య సౌందర్యం , అంత:సౌందర్యం అని రెండు విధములు కదా ..భార్యభర్తలు ఆత్మీయతతో, ఆదరాభిమానలతో ఉన్నప్పుడు వారిద్దరు ఒకరికొకరు అందంగా కనిపిస్తారు. అలాగే వారి పిల్లకు మార్గదర్సకులైతే వాళ్ళు చాలా సౌందర్యవంతులుగా కనిపిస్తారు ..అలాగే ఇది ప్రకృతి యొక్క అతి సహజమైన సుందరం. కాని సుందరకాండ లోక సాధారణ స్థితికి భిన్నంగా అత్యద్భుతమైన సౌందర్యం కలిగినది అందుకే "సుందర"కాండ అయ్యింది.

సుందరె సుందరో రామ: సుందరే సుందరీ కథా
సుందరే సుందరీ సీత సుందరే సుందం వనం
సుందరే సుందరం కావ్యం సుందరే సుందరం కపి:
సుందరే సుందరం మంత్రం సుందరే కిం న సుందరం?

పురషమోహనాకారుడు, సుగుణగణ సుందరుడు శ్రీరాముడు, సర్వ విధములా భువనైక మాత సీతా దేవి. కాంచనాద్రి కమనీయ విగ్రహుడైన హనుమంతుడు పరమసుందరుడు. అశోకవనం అతిలోక సుందరం. శ్రీ సీతరామహనుమంతుల మంత్రములు దివ్యములు సుందరములు. ఈ మహితాత్ముల కధ సర్వాధ్భుత సుందరం. ఈ సుందరకాండ కవిత్వం అత్యంత సుందరం. కనుక ఈ సుందరకాండమునందు సుందరం కానిదేది? సర్వమూ సుందరమే. ఇందు హనుమంతుని చే సీతారాముల వర్ణన అద్భుతము గా చెప్పబడినది.

హనుమంతుని ప్రతిభ ::

హనుమంతుడు జితేంద్రియుడు, ప్రజ్ఞావంతులలో ప్రముఖుడు, వాయు సుతునకు ఏకైక లక్ష్యం. ఒక స్త్రీ ని స్త్రీ ల మధ్యనే వెదుకుట ,అదియును అర్ధరాత్రి వేళ రావణుని ఏకాంత మందిరమున అతని కాంతల మధ్య వెదుకుట , హనుమంతుని యొక్క నిశ్చల బుద్ది కి జితెన్ద్రియత్వమునకు నిదర్సనం.సుందరీ సుందరుల గాధను తెలుపునది సుందరకాండము. సుందరకాండము సాధకుని లో పరమాత్మ యొక్క అంశ శ్రీరాముని తో ప్రకృతి అంశ అయిన సీతమ్మను కలుపుటకు హనుమంతుడు చేసిన "అన్వేషణే ". ఆంజనేయుడు అనగా బుద్ది యోగము.

సుందరకాండ గురించి మా తెలుగు ఆచార్యులు చెబుతుంటే అద్భుతంగా ఉండేది. అందులో హనుమంతుడు లంక నుండి తిరిగి రాముని దర్సించగానే "దృష్టా దేవితి" అంటే చూచితిని సీతను అని అర్ధం వస్తుంది.ఎంతో ఆత్రుత తో ఎదురు చూస్తున్న రామునికి ఈ ఒక్క చిన్న మాట ఆయనుకు ఉపసమనం ఇస్తుంది , ఆ వర్ణ న అద్భుతంగా చెప్పేవారు. లంకా అనే పదాన్ని తిరగ రాస్తే కాలం అనే అర్ధం వస్తుందని , కాలం అనె పదానికి నలుపు అనే అర్ధం వస్తుందని, నలుపు అంటె తమో గుణానికి కారణమని, దానికి బుధ్ధి కి ప్రతీక అయిన హనుమంతుడు పూర్తిగ దహించేట్లు చెయ్యడం లో అర్ధం , మనలోని తమో గుణాన్ని , సరైన బుద్ది తో దూరం చేసుకొవాలని ఎంతో చక్కగ చెప్పేవారు.

రామాయణాన్నిపూర్తిగా చెప్పే లవకుశ లో ఈ పాట నాకెంతో ఇష్టం..

(యూట్యూబ్ మరియు గీతా ప్రెస్స్ వారి సౌజన్యం తో )

9 comments:

కొత్త పాళీ said...

బాగుందండీ.
నా చిన్నప్పుడు మాచారం ఆంజనేయస్వామి గుడినుంచి లౌడ్ స్పీకర్లో వచ్చే మల్లాది చన్ద్రశేఖర శాస్త్రిగారి సున్దరకాణ్డ పురాణం గుర్తొచ్చింది.
సున్దరో వానరః కపిః .. సుందరుడంటే వానరుడని కూడా అర్థం ఉందిట.

చిన్నమయ్య said...

చిన్నప్పుడు మా అయ్యవారు సుందరకాండ లోని త్రిజటా స్వప్నమూ, చూడామణి ప్రదాన ఘట్టాలని చాలా హృద్యంగా వివరించేవారు. పాఠ్యభాగంతో ఆపెయ్యకుండా కధని ముందు వెనకా కొనసాగించి చెప్పేవారు.

ఓ పక్కా సీతావియోగ దుఃఖంతోనూ, మరోవైపు హనుమ ఏం సమచారం తెస్తాడో అన్న ఉత్సుకతతోనూ వున్న రాముని మనఃస్థితి ఎరిగి, క్లుప్తంగా "దృష్ట్వాం" అని పెద్దగా కేక పెట్టేడని మా ఉపాధ్యాయురాలు చెప్పేరు. కంబ రామాయణంలో "కండేన్" అని వుందట. ఒకసారి, మేనేజుమెంటు ట్రైనింగులో బ్రెవిటీ గురించి ముచ్చటిస్తూ, ఆచార్యులవారు ఈ ఉదాహరణని చెప్పేరు.
ఒక సారి సంస్కృత విద్యా పీఠం అయ్యవారు చూడామణి ప్రదాన ఘట్టం వివరిస్తూ ఈ సమస్యని ఇచ్చేరు (మీ ముందు కుప్పిగంతులేస్తున్నానేమో!)

సువర్ణస్య సువర్ణస్య సువర్ణస్యచ జానకి |
ప్రేషితా తవ రామేణ సువర్ణస్యచ ముద్రికా ||

సుజన దుత్తలూరు said...

కొత్త పాళి గారు ,

బాగా చెప్పారు ..సుందరుడంటే వానరుడా? :)హనుమంతుడు పరమసుందరుడు కదా ..ఐనా వానరుడే కదా..చమత్కారం బాగుంది.

సుజన దుత్తలూరు said...

@చిన్నమయ్య గారు,
చాల బాగున్నాయండి మీ అనుభూతులు.నేను కుడా ఇదే విషయాన్ని (దృష్ట్వాం) సహ విధ్యార్ధుల తో ప్రసంగం లో చెప్పినప్పుడు , హర్షధ్వానాలను అందుకున్నాను. ఎంతమందో వీరాధి వీరులుండగా హనుమంతుని ఎంపిక చేసుకునే విధానాన్ని గురించి చెప్పడం కుడా విధ్యార్థులకు ఆసక్తి ని కలిగిస్తాయి. అలాగే మా పాఠశాల విద్యాభ్యాసం ముగింపు సంధర్భంగా మా తెలుగు అధ్యాపకులు చెప్పే కిశోర న్యాయాలు కుడా చాల బాగుండేవి.
మీరు ఇచ్చిన సమస్యని మీ వాక్యాలతోనె పూరిస్తే బావుంటుందని నా అభిలాష.

కృతజ్ఞతలు.

Anonymous said...

meylibangaru kaantu leeney seethamma raamuni yokka bangaru mudrikan gaikonindi ani arthameymo...sujana gaarikantey mundu raayalani tapatryam...

Anonymous said...

Hey Srujana... that's really nice postings... lavakusa song in ramaayana, that's really nice.. i too was looking those songs online.. nice Srujana... any way nice to meet u...Sri( chamarthisridhar@gmail.com).

యేలూరు అమర్ said...

సుజనగారూ,

నమస్కారం. మీ బ్లాగు చదివి చాలా సంతోషం కలిగింది.

నేను సుందరకాండములో ఒక శ్లోకం కొరకు ప్రయత్నిస్తున్నాను. ఆ శ్లోకంలో హనుమ సీతమ్మతో అంటాడు ... "నేను వానరులలో అందరికంటే తక్కువవాడిని అని" అన్నట్లు. ఆ శ్లోకం మీ దగ్గర ఉంటే నాకు తెలియజేయగలరు. మీకు కృతజ్ఞుడనై ఉంటాను.

భవదీయుడు,
అమర్

ఆత్రేయ కొండూరు said...

అమర్‌ గారు ఇవిగో ఆ శ్లోకాలు.

మత్‌ విశిష్టాహ్‌ చ తుల్యాహ్‌ చ సంతి తత్ర వన ఒకసహ్‌ |
మత్తహ్‌ ప్రత్యవరహ్‌ కశ్చిన్‌ న అస్తి సుగ్రీవ సన్నిధౌ || 5-39-38

తత్ర= వారిలో; వనౌసహ్‌= (కొన్ని ) కోతులు; మద్విషిశ్టాష్చ= నాకంటే గొప్పవారు; తుల్యాష్చ= కొంతమంది సములు; సంతి= అక్కడ; కష్చిత్‌ నాస్తి= లేరు; ప్రత్యవరహ్‌= తక్కువవారు; మత్తహ్‌= నాకంటే.

In them, some of the monkeys are superior to me and some are even equal to me. No one in the vicinity of Sugreeva is inferior to me.

అహం తావత్‌ ఇహ ప్రాప్తహ్‌ కిం పునహ్‌ తె మహాబలాహ్‌ |
న హి ప్రకృ్ఇష్టాహ్‌ ప్రెష్యంతె ప్రెష్యంతె హి ఇతరె జనాహ్‌ || 5-39-39

అహం తావత్‌= నా అంత నేనే; అనుప్రాప్తహ్‌= వచ్చాను; ఇహ= ఇక్కడికి; కిం పునహ్‌= ఎందుకు ; తె= వారి గురించి; మహాబలాహ్‌= మహబలులు?; ప్రకృ్ఇశ్టాహ్‌= ఉత్తమమయిన వారు; న ప్రెశ్యంతె హి= ఇలా పంపరు; ఇతరె= ఇతర; జనాహ్‌= జనులను; ప్రెశంతె హి= పంపుతారు.

When I have arrived here, why to talk about the mighty ones? Generally, superior ones are not sent for errands. Only others are indeed sent

ఆత్రేయ కొండూరు said...

http://www.valmikiramayan.net/