"శాకంబరి దేవి ప్రసాదం...ఆంధ్ర శాఖం ..గోంగూర " ఈ మాటలు అందరికి సుపరిచితమైన వే ...అదేనండి అల్లు రామలింగయ్య మాయాబజార్ లో అన్నమాటలు ..మహాభారతం లో పిట్టకద లాంటి మాయాబజార్ లో కూడా గోంగూర గురించి ప్రస్తావించి దాని మీద తన ఇష్టాన్ని , ఆంధ్రుల మీద అభిమానాన్ని, చతురతని చాటుకున్నారు పింగళి గారు. ఏది ఏమైనా విందులో మాత్రం గోంగూర స్టేటస్ వేరు. . గోంగూర తో నా అనుభందాలను నెమరు వేసుకోవాలనిపించింది ఒక్క నాకేమిటి ఆంధ్రుడైన ప్రతి ఒక్కరి కి గోంగూర అనగానే ఏదో ఒక అనుభూతి తప్పకుండా ఉండనే ఉంటుంది. నా మటుకు గోంగూర అనగానే లాలాజలం ఊరిపోతుంది . దాన్ని ఆపడం ఒక్క గొంగూరకే సాధ్యం. వేడి వేడి అన్నం లో గోంగూర పచ్చడి ఉల్లిపాయ ముక్క నంజుకుని తింటుంటే ఒహ్ ...వర్ణించడానికి మాటలు చాలవు ..
పాపం గోంగూర కి కుడా తప్పలేదు ప్రాంతీయతా భావం. గుంటూరు గోంగూర కి మిగతా ప్రాంతాల గోంగూరకి చాల తేడా ఉందని ఎప్పడు గోంగూర తిన్నాదాని మీదో టాపిక్ ఖచ్చితంగా ఉండనే ఉంటుంది మా ఇంట్లో. మా మామయ్యా గారైతే ...వాళ్ల బామ్మగారు రాచ్చిప్పల్లో గోంగూర పులుసు వండే విధానం , మూడు రోజులైనా పాడైపోకుండా ఉండేదని తలచుకుంటునే ఉంటారు .. గోంగూర తింటున్నప్పుడల్లా....!!!అంటే దీని పర్యవసానం గొంగురాభిమానమనేది తర తరాలదన్నమాట. ఇప్పటిది కాదు.
ఇక కార్తిక, మార్గశిర మాసాల్లో ఐతే మా పాలేరు ఏమి తెచ్చిన తేకపోయిన గోంగూర , పచ్చిమిరపకాయలు మాత్రం ఠంచనుగా తెచ్చేసేవాడు .. ఆ పొలం గట్ల మీద దొరికే గోంగూర అంత ఫ్రెష్ గా ..ఫ్రెష్ ఫ్రెష్ అని చావగొట్టె రిలయన్స్ ఫ్రెష్ లో నేను ఎప్పుడూ చూడలేదు ..కాని ఆ ఫ్రెష్కి వెళ్ళినప్పుడు సరుకుల్లో భాగంగా ప్రియమ్మ (అదేనండి ప్రియ పచ్చడి ) తయారు చేసే పచ్చడి కుడా చేరిపోతుంది .మా అమ్మగారు చేసే పచ్చడిని తలచుకోవడం ,ప్రియమ్మ పచ్చడి ని తిట్టుకోవడం ..ఆఖరికి సీసా ఖాళీ చెయ్యడం పరిపాటే ..ఇన్ని సంజాయీషీలు ఎందుకు నువ్వే చేసుకోవచ్చు కదా అని కూడా అడుగుతుంటారు ..బద్దకించి మాత్రం కాదు, ఎందుకంటే మేముండేది ఆంధ్రాకి నాలుగు గంటల దూరమే అయిన ఇక్కడ(మద్రాసు లో)గోంగూర దొరకడం కష్టం .
గోంగూర మీద ఆశ కొంత మందిని దొంగలుగా కుడా మార్చేస్తుందండి. ఇది నిజ్జంగా నిజ్జం ..ఆ మధ్య మా ఇంట్లో ఒక శుభకార్యం జరిగింది..ఇక ఆ కార్యం లో గోంగూర ఉంటే వచ్చిన వాళ్లు కూడా సంతోషిస్తారు కదా ..అని వంట వాళ్ళని పురమాయించారు మా అమ్మగారు ..అదేంటో గాని ఆ రోజు వంటవాళ్ళు అద్భుతంగా చేసారు గోంగూర పచ్చడి . మొదటి బంతి లో నే కూర్చున్న తెలిసిన ఆవిడ ఒకరు పెరట్లో కి వెళ్లి ఎవరు చూడకుండా గోంగూర పచ్చడి డబ్బాలో పెట్టుకు పోయారట ..ఆ విషయం ఈ మధ్య మా వంట మనిషి చెబితే విని ఆశ్చర్య పోయా ..గోంగూర పచ్చడి పాపం మనుషులని దొంగలు గా కుడా మారుస్తుందని నవ్వుకున్నా ... మా నాన్నగారు చనిపొయే ముందు రోజు చివరి సారి గా కలిసి భోంచేసినప్పుడు గోంగూర పచ్చడి ఉండడం కూడా యాదృచ్చికమేమో..
13 comments:
కద్దు అంటే కలదు అని అర్థం...మీరే అర్థం లో వాడారో నాకర్థం కాలేదు......
చాల తక్కువ అని ..సరిదిద్దినందుకు కృతజ్ఞతలు
గోంగూర ప్రాశస్త్యాన్నీ, దాంతో తెలుగువారి అనుబంధాన్ని చక్కగా వివరించేరు.ఇప్పుడు, నేనుండే ఈ చోట, గోంగూర దొరకదుగానీ, చిన్నప్పుడు మా అమ్మ తరచూ చేసేది.
బళ్లో శాస్త్రీయ పదాలు నేర్పించినప్పుడు, గోంగూర ని హైబిస్కస్ కన్నాబినస్ అంటారని నేర్చుకున్నది మొదలు, ఇంటిలో వాళ్లనీ, ఇంటికొచ్చినా వాళ్లనీ, గోంగుర పచ్చడిని హైబిస్కస్ కన్నాబినస్ పచ్చడి అని, ఊదరగొట్టెసేవాళ్లము.
kaddu ante english lo:common" frequent" in general" aney arthalu vasthayi anukunta...
hindi (urdu) lo Rivaaju ( telugulo kooda ee padam vadatharu)aney padam almost edey arthanni kalagacheysthundi ex: atanu ammayila gurunchi matladdam chaala kaddu.......oops may be it means "SELDOM" ...????
ఇక్కడ అంటే చెన్నపట్నం లో ఆంధ్రా మెస్ లు బాగా ఫేమస్, ఇక్కడికి వచ్చే తమిళవాళ్ళు కూడా గోంగూర పచ్చడి తెగ తింటారు, సాంబారు లేకుండా ముద్ద దిగని వాళ్ళకి కూడా గోంగూర నచ్చుతుంది (నేను కూడా చెన్నపట్నంలోనే ఉంటున్నాను)
@చిన్నమయ్య గారు మరియు
@రామక్రిష్ణ గారు ,
మీ అనుభూతులని తలచుకున్నందుకు ఆనందాభినందనలు
గోంగూర పచ్చళ్లలో రెండు రకాలు .. ఒకటి నిల్వ పచ్చడి. రెండోది ఆ రోజు కి ఆ రోజే వాడేది. గోంగూర పులుసు ఒక రకం. ముద్దపప్పు నెయ్యి కలిపి తింటే దాని మజాయే వేరు. గొంగూరాలలో రెండు రకాలు. ఒకటి నాటు రకం (నిల్వ పచ్చడకి వాడుతారు). రెండోది ఎర్ర గోంగూర.. దీన్ని DAILY పచ్చడికి వాడతారు. ఎండా కాలం వచ్చిందంటీ మా ఆవిడకి ఇదే పని. (మరి మేము ఉండేది GUNTURLO కదా మరి). అన్ని రకాలు పెట్టడం అందరకి పంపడం. (లాస్ట్ లో మేము బజార్లో కొనుక్కోవడం).
నాకు గోంగూర నిల్వ పచ్చడి అంటే చాలా ఇష్టం.అమ్మ ఏమో మామూలు పచ్చడే చేస్తూవుండేది.అదంటే మాత్రం నాకు[చాలా మందికే] మహా చిరాకు.మా ఊరిలో ఏ కూరా లేకపోతే గోంగూర వండుకుంటారు అందరూను.అక్కడ ఏమీ లేదు అని చెప్పడానికి మా వైపు ఎక్కువగా"ఆ ఏముంది.... గోంగూర"అంటారు.
@క్రిష్ణారావు గారు,
ఐతే ఇప్పుడు మీ ఆవిడ గారు అదే పని మీద ఉండి ఉంటారేమో. ఎంతైనా ఎండాకాలం కదా మరి. :)
@రాధిక గారు,
"ఆ ఏముంది ..గోంగూర" అనే ఈ జాతీయం నేను కుడా విన్నాను. బాగా చెప్పారు.
గోంగూర ఒక round పెట్టడం courier చేయడం ఎప్పుడో అయిపొయింది. next round లో ఎమిటో నాకు కూడా తెలియదు. చూడాలి.
Mee googlepages blog lo "My Palace in this Mortal World .......
" is not complete..
Post a Comment