Wednesday, April 16, 2008

రామయ్యా ..తేనేగూడు లో పొరపాటు జరిగిందయ్యా..

రామయ్య.. పొరపాటు జరిగిపోయిందయ్యా ..శ్రీ రామనవమి రోజు నిన్ను స్తుతిస్తూ భద్రాచలం లో అందంగా కొలువు తీరిన నీ ముఖచిత్రాన్ని అందరూ చూడాలనే ఆశ తో "చూచితిని సీతమ్మను రామా" (ఏప్రిల్ 14)అనే టపా ద్వారా అంతర్జాలం లో ప్రచురించాను. తేనేగూడు అనే బ్లాగుల సమాహారం లో బ్లాగు లో ని వ్యాసములను మూఖచిత్రం తో సహా చూపించే మొదటి పేజీ లో ఆ ముఖచిత్రం ఎలా వచ్చిందో మరి. సాంకేతిక కారణాలేలాంటివో నా చిత్తానికి నేను ఎరుగను. మరి ఎక్కడ పొరపాటు జరిగిందో ఏమో ..నా మనస్సాక్షిగా నేను ప్రచురించింది మాత్రం నీ ముఖచిత్రాన్నే ప్రభు. తప్పిదం జరిగిందనే ఆవేదనలో వారికి లేఖ కూడా వ్రాసాను. కాని ప్రత్యుత్తరం లేదు. ఎవరిని నిందించాలి అజ్ఞానపు అంతర్జాలాన్నా ? నీ ముఖచిత్రాన్ని వీక్షించలేని మా కన్నులనా..


నా మనవి ఆలకించు శ్రీరామ..నీవైనా చెప్పవమ్మా సీతమ్మా..

నా టపా కలిగిన లింకును ఇక్కడ పొందుపరుస్తున్నాను.

http://www.thenegoodu.com/?which=50&cid=&mode=

8 comments:

రాధిక said...

మీ తప్పిదం లేదని తెలుస్తుందండి.ఒకసారి తెనె గూడులోని ఆ బొమ్మపై క్లిక్ చెయ్యండి.సీతా సమేత రాముడు దర్శనమిస్తున్నాడు.

Rajendra Devarapalli said...

తేనెగూడు లో మీరు ఎక్కించిన బొమ్మ మీ బొమ్మలా వస్తే ఆశ్చర్యపడాలి రాకపోతెకాదు!!

Unknown said...

తేనెగూడు వారు మీ/మన బ్లాగులలో నుంచి చిత్రాలను "cache" చేసి చిన్న చిత్రాలుగా చూపించడానికి ప్రయత్నిస్తున్నారు.

ఆ ప్రయత్నంలో ఏదో లోపం.
మీ అసలు చిత్రం లంకె తీసుకుంటే అది ఈ కిందిది:

http://bp2.blogger.com/_QTtkvXjYlb0/SANA1lVToLI/AAAAAAAAACA/uZzOHkIaaOM/s1600-h/image002.gif

కానీ తేనిగూడు వారు "cache" చేసిన లంకె తీసుకుంటే అది

http://www.thenegoodu.com/thumb/phpThumb.php?src=http://bp2.blogger.com/_QTtkvXjYlb0/SANA1lVToLI/AAAAAAAAACA/uZzOHkIaaOM/s200/image002.gif

అందులోని చిత్రం లంకె వేరు.

http://bp2.blogger.com/_QTtkvXjYlb0/SANA1lVToLI/AAAAAAAAACA/uZzOHkIaaOM/s200/image002.gif

(దానిని తెరచినా మీ చిత్రమే వస్తుంది కాకపోతే)

ఆ విధానాన్ని వారు సరి చేసుకుంటే సరిపోతుంది.
ఇది మీ సమస్య కాదు.

తేనెగూడు వారికి తెలుపండి. ముందు ముందు వారు సరిచేసుకుంటారు.

సుజన దుత్తలూరు said...

@ రాధిక గారు,

మీరు చెప్పింది సత్యమే. నా తప్పిదం లెదని తెలిసింది.కృతజ్ఞతలు. ప్రవీణ్ గారి సాంకేతిక విపులీకరణ ఈ సమస్య కి పరిష్కారం చూపింది.

సుజన దుత్తలూరు said...

@ప్రవీణ్ గారు,

నేను వారికి ఈ సమస్య గురించి ఇంతకు మునుపే లేఖ ద్వారా తెలియ జేసాను. బహుశా వారు ఈ సమస్యను ఇంక పరిగణలోనికి తీసుకున్నట్టు కనిపించలేదు. మీ సాంకేతిక విపులీకరణ ద్వారా దీనికి గల కారణం అర్ధమైంది. మీరు సమయాన్ని వెచ్చించి విసిదీకరమైన వ్యాఖ్య చేసినందుకు కృతజ్ఞతలు.

సుజన దుత్తలూరు said...

@రాజెంద్ర కుమార్ గారు,

మీ వ్యంగ్యం లో కల భావన ఎమిటో అర్ధం కాలేదు.

Rajendra Devarapalli said...

సుజన గారు ఇందులో వ్యంగ్యం ఏమీలేదండి.తేనెగూడులో దాదాపుగా మన బొమ్మలు మనం ఆప్ లోడ్ చేసినట్లు కనిపించవు.ఒకవేళ కనిపిస్తే మనం ఆశ్చర్యపోవాల్సిందె అని చెప్పాను

రాజేంద్ర

సుజన దుత్తలూరు said...

రాజేంద్ర కుమార్ గారు,
అర్ధమైందండి ..కృతజ్ఞతలు